స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులకు దిశానిర్దేశం
పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు పార్లమెంట్ కోఆర్డినేటర్ రవి కుమార్‌కు ఘన స్వాగతం
పార్వతీపురం మన్యం | Ntoday News
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు విచ్చేసిన గోల్డెన్‌సూ మైరైన్డా ఆక్వా హేచరీస్ అధినేత, సూడా చైర్మన్, అరకు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ కొరికనా రవి కుమార్‌ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ కమిటీ సభ్యుడు పెంట శంకర్ రావు, జియ్యమ్మవలస జనసేన పార్టీ నాయకులు, ఆక్వా రంగంలో పారిశ్రామికవేత్త మెండి రమేష్, అరకు పార్లమెంట్ సపోర్టింగ్ టీం సభ్యుడు లచ్చిపతుల రంజిత్ కుమార్ తదితరులు రవి కుమార్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడంపై చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస మండలం కూడా భాగంగా ఉంది.
ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు.