BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 12:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి.

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Sep, 2026 - 12:20 PM
20 వీక్షణలు

న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సు-2026 ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరగనున్న భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. భారత్, చైనా మధ్య సంబంధాల నేపథ్యంలో ఇరువురు నేతల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

మోదీ, జిన్‌పింగ్ గత మూడేళ్లలో పలుమార్లు సమావేశమైనప్పటికీ.. భారత్‌లో ఇరువురు నేతలు కలుసుకోవడం చాలా కాలం తర్వాత జరుగుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, ప్రాంతీయ పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు 

ఆసియాలో కీలక శక్తులుగా ఉన్న భారత్, చైనా పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగితే దాని ప్రభావం ప్రపంచ స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య స్థిరమైన సంబంధాలు, పరస్పర సహకారం ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ శాంతికి కూడా దోహదపడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

బ్రిక్స్ వేదికగా మోదీ–జిన్‌పింగ్ భేటీ ఎలా సాగుతుంది, ఇరుదేశాల సంబంధాలపై ఎలాంటి సందేశం వెలువడుతుందన్న అంశంపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.