BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 12:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పుతిన్, జిన్‌పింగ్ కోసం ప్రత్యేక భద్రతా వాహనాలు.. ఢిల్లీలో ఆకట్టుకుంటున్న ఆర్మర్డ్ కార్లు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Sep, 2026 - 12:08 PM
16 వీక్షణలు

న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకోవడంతో దేశ రాజధానిలో సందడి నెలకొంది. విదేశీ నేతల పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా.. వారి కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్మర్డ్ వాహనాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అధికారిక AURUS SENAT ఆర్మర్డ్ కారులో పర్యటిస్తున్నారు. ఈ వాహనం విలువ సుమారు రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కోసం సుమారు రూ.7 కోట్ల విలువైన Hongqi N701 ప్రత్యేక వాహనాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు వాహనాల్లోనూ అధునాతన భద్రతా సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. భారీ ఆర్మర్, బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో పాటు అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు వంటి ప్రత్యేక సదుపాయాలు వీటిలో ఉన్నట్లు పేర్కొంటున్నారు.

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు విదేశీ అధినేతల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వారి కాన్వాయ్‌లలోని అత్యాధునిక వాహనాలు నగరవాసుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.