BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 12:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

IFAT India 2026 ప్రదర్శనలో గ్రేటర్ వరంగల్ కమిషనర్.

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Sep, 2026 - 12:20 PM
8 వీక్షణలు

వరంగల్: ముంబైలో నిర్వహిస్తున్న IFAT India 2026 మూడు రోజుల ప్రదర్శనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పాల్గొన్నారు. ప్రదర్శన చివరి రోజైన శుక్రవారం వివిధ సంస్థలు ప్రదర్శించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు.

మంచినీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సీవరేజ్, రీసైక్లింగ్ తదితర రంగాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలు, పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ నగరంలో త్వరలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థకు అవసరమైన పైపుల అనుసంధానం, సీవరేజ్ శుద్ధి, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంపై సంబంధిత సంస్థల ప్రతినిధులతో చర్చించారు.

అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఆధునిక పద్ధతులు, వ్యర్థాల సేకరణ–ప్రాసెసింగ్ విధానాలు, మున్సిపల్ సేవలకు సంబంధించిన ఆధునిక బిల్లింగ్ పరికరాలపై సంస్థల ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.