BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 11:56 am
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రామాభివృద్ధికి సొంత ఆదాయ నిధులు: మంత్రి సీతక్క

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Sep, 2026 - 11:56 AM
16 వీక్షణలు

హైదరాబాద్: గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేయడం, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.

పంచాయతీలకు పన్నులు, ఇతర మార్గాల ద్వారా సమకూరే సొంత ఆదాయాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం కల్పించడం ద్వారా గ్రామస్థాయిలో ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సొంత ఆదాయాన్ని నేరుగా వినియోగించుకునే అవకాశం ఉండటంతో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రహదారులు తదితర స్థానిక అవసరాలపై పంచాయతీలు మరింత వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా బలం చేకూర్చడం ద్వారా స్థానిక సంస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.