BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 10:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లోక్ అదాలత్ సెటిల్‌మెంట్‌తో బాధిత కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 10:23 PM
5 వీక్షణలు

లోక్ అదాలత్ సెటిల్‌మెంట్‌తో బాధిత కుటుంబానికి భారీ ఊరట

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం

నందిగామ, సెప్టెంబర్ 12: ఏళ్ల తరబడి కొనసాగిన న్యాయపోరాటానికి లోక్ అదాలత్ సెటిల్‌మెంట్‌తో తెరపడింది. 2019లో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శనగపాడు రమణ మృతి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం అందింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ.42,00,000 చెక్కును అందజేశారు.

ఈ వ్యవహారంపై నందిగామ 16వ అదనపు జిల్లా కోర్టులో ఎం.వి.ఓ.పీ. నంబర్ 50/2019 కేసు విచారణ జరిగింది. లోక్ అదాలత్ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఇరు పక్షాల కక్షిదారులు, న్యాయవాదుల సమక్షంలో నందిగామ 16వ అదనపు జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి పరిహారం చెక్కును అందించారు.

ఆర్టీసీ తరఫున న్యాయవాది చిరుమామిళ్ల శ్రీనివాసరావు ఈ వ్యవహారంలో సహకారం అందించారు. పరిహారం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా కొనసాగుతున్న కేసు పరిష్కారం కావడంతో కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభించినట్లయింది.

ఈ కార్యక్రమంలో నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కార్యదర్శి చేరుకుమల్లి రామారావు, ఇరు పక్షాల న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.