రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
వీరనారి ఐలమ్మ 41వ వర్ధంతి సెమినార్
భువనగిరి పెన్షనర్ భవన్ లో జరిగిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రజక వృత్తిదారులకు సామాజిక భద్రత రక్షణ చట్టం కొరకు జరిగిన "సెమినార్" బాతరాజు యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, సాంఘిక బహిష్కరణలు వరుసగా అగ్రకుల పెత్తందారులచే దాడిలకు గురౌతున్నారని తెలిపారు.కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రజకులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రజకులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రభుత్వాన్ని కోరారు. రజకులకు 10 లక్షల వరకు వ్యక్తిగత సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపారని. అదేవిధంగా లాండ్రీ యూనిట్ ప్రతి జిల్లాలో 10 కోట్ల తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చిందని కాని అమలు చేయలేదన్నారు . వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని. ప్రభుత్వ వాగ్దానాల అమలుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు. అడ్వకేట్ గొనెకొండ లింగయ్య మాట్లాడుతూ రజకులు సామాజికంగా, ఆర్థిక, రాజకీయంగా, విద్యాపరంగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో రజకుల దోబీఘట్లు స్థలాలకు ఎన్ఓసిలిచి స్థలాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న సమస్యలపైన పెద్ద ఎత్తున రజకులను చైతన్యం చేసి ఆందోళన, ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, వడ్డెమాన్ బాలురాజు, జిల్లా సహాయకార్యదర్శి వడ్డెమాను రవి, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి లింగయ్య, రత్నాపురం పద్మ,ఐతరాజు సావిత్రమ్మ, పెడకంటి లింగస్వామి, పొన్నం ఉప్పలయ్య, వడ్లకొండ రమేష్, కొండూరు శంకర్,ఐతరాజు రాములు,ఎలిమినేటి మహేష్, అలుగునూరి నర్సింహా, కుసంపల్లి కృష్ణ, అక్కెనపల్లి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు
