BREAKING
thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం
Date of Publish : 12 September 2026, 06:08 pm
Posted by : A. MURALIDHAR

గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
12 Sep, 2026 - 06:08 PM
53 వీక్షణలు

వేకువజామున ప్రత్యేక సేవల్లో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి

గురువాయూర్ | Ntoday News

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళలోని త్రిశూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని శనివారం వేకువజామున దర్శించుకున్నారు. ప్రస్తుతం కేరళలో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గురువాయూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తాజా సమాచారం. 

వేకువజామున సుమారు 3 గంటలకు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, ఆలయంలో అత్యంత పవిత్రమైన నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి నిర్వహించే తైలాభిషేకం, వാകచార్తు, శంఖాభిషేకం తదితర సేవల్లో పాల్గొన్నారు. గురువాయూర్ ఆలయంలో నిర్మాల్య దర్శనం సాధారణంగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. 

ఆలయ అధికారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు. దక్షిణ ముఖ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ఆయన గర్భగుడిలో మూలవిరాట్టుకు నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో వీక్షించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

నిర్మాల్య దర్శనం అనంతరం ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహించే అభిషేక, అలంకరణ కార్యక్రమాలను ఆయన తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గురువాయూర్ మేల్శాంతి, ఇతర ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కేరళ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతరం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.