రవికుమారి పార్థివదేహానికి జడ్జి ఏ. సింధూర నివాళి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకుడు, సీనియర్ న్యాయవాది ఎం. నాగేంద్ర ప్రసాద్ భార్య మేకల రవికుమారి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. సింధూర సందర్శించారు. రవికుమారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. రవికుమారి మృతి పట్ల పలువురు న్యాయవాదులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.