BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 07:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో హోంవర్క్ చేయలేదని పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుడి దౌర్జన్యం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 07:21 PM
6 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులపై హిందీ ఉపాధ్యాయుడు దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో విద్యార్థులను ఇష్టారీతిన హింసించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు పేరుతో విద్యార్థులపై శారీరకంగా, మానసికంగా ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై తగిన శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హోంవర్క్ చేయలేదనే కారణంతో విద్యార్థులను హింసించడం వంటి ఘటనలను ఉపేక్షించకూడదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.

పాఠశాల యాజమాన్యం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంది, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటనే విషయాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.