BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒంటరి మహిళలకు గుడ్‌న్యూస్.. సర్టిఫికెట్ల జారీకి మరింత వెసులుబాటు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 08:52 PM
9 వీక్షణలు

విడాకులు పొందినవారు, పెళ్లికాని ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఒంటరి మహిళలకు చేయూత పింఛను పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఒంటరి మహిళలకు ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్లతో పాటు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా జారీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటివరకు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాలపై ఆధారపడాల్సి రావడంతో అర్హులైన మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో ధ్రువీకరణ ప్రక్రియ మరింత అందుబాటులోకి రానుంది.

అర్హత కలిగిన ఒంటరి మహిళలు సులభంగా ధ్రువీకరణ పత్రాలు పొందడంతో పాటు చేయూత పింఛను కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఒంటరి మహిళలకు సామాజిక భద్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.