BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 6,172 కేసుల పరిష్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 08:51 PM
6 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. తిరువూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు, రెండు అదనపు సివిల్ కోర్టుల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అట్లూరి సిందూర పర్యవేక్షణలో లోక్ అదాలత్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్‌కు సంబంధించిన 172 కేసులతో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన సుమారు 6,000 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులు పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదికగా నిలిచిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.

కార్యక్రమంలో సహాయ ప్రభుత్వ న్యాయవాది షేక్ బడేమియా, తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దనరావు, ప్రధాన కార్యదర్శి జి. కృష్ణారెడ్డి, అదనపు ప్రభుత్వ న్యాయవాది దారా మాధవరావు, లోక్ అదాలత్ సభ్యుడు షేక్ సుభాని, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.