BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 08:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: అకాల భారీ వర్షంతో జలమయమైన లోతట్టు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 08:40 PM
12 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణంలో శనివారం ఒక్కసారిగా కురిసిన అకాల భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీగా వర్షం కురవడంతో పట్టణంలోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తిరువూరు బస్టాండులోకి సైతం వరద నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్టాండు పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలు సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల నీరు నిలిచిపోయింది.

ఇటీవల వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ముఖ్యంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారీ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కారణంగా పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.