BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 08:50 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్కేసర్‌లో ఓఆర్‌ఆర్‌ వంతెన స్లాబ్‌కు నష్టం.. కలకలం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
12 Sep, 2026 - 08:50 PM
5 వీక్షణలు

ఓవర్‌లోడ్ లారీ కోసమా.. గణేష్ విగ్రహం తరలింపుకోసమా? అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

ఘట్కేసర్ | Ntoday News

ఘట్కేసర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వంతెన స్లాబ్‌ దెబ్బతిన్నట్లు కనిపించడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం ఓవర్‌లోడ్ లారీని వంతెన కిందుగా లేదా పైగా దాటించే క్రమంలో స్లాబ్‌ భాగాన్ని తొలగించినట్లు స్థానికంగా సమాచారం.

మరోవైపు గణేష్ విగ్రహాన్ని తరలించేందుకు వంతెనకు సంబంధించిన స్లాబ్‌ బీమ్‌లను జేసీబీతో తొలగించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్లాబ్‌ భాగం దెబ్బతినడంతో ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్న పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

ఓఆర్‌ఆర్‌పై నిత్యం పర్యవేక్షణ ఉండే సిబ్బంది, స్థానిక పోలీసులకు ఈ ఘటనపై సమాచారం లేకపోవడంపై స్థానికులు, వాహనదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వంతెన నిర్మాణానికి నష్టం కలిగించిన ఘటనపై వెంటనే విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.

అధిక లోడుతో వెళ్లే వాహనాల వల్ల వంతెనలకు నష్టం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టి, వాహనదారులకు ప్రమాదం జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

ఓఆర్‌ఆర్‌పై వాహనాలను నిలపడం, పార్కింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని ట్రాఫిక్ పోలీసులు ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో వంతెనల భద్రతపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.