BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 31 July 2026, 03:00 pm
Posted by : NTODAY NEWS

చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
31 Jul, 2026 - 03:00 PM
52 వీక్షణలు

చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం

అన్నమయ్య జిల్లా | చిన్నమండెం మండలం | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ, కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.