రొంపిచర్ల వద్ద ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్ల వాహనం
ప్రమాదంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కు కాలు విరగగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
రొంపిచర్ల | Ntoday News
రొంపిచర్ల మండలం బాటగంగమ్మ గుడి సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న స్మగ్లర్ల వాహనం ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.
ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వాహనాన్ని వెంబడించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాటగంగమ్మ గుడి సమీపంలో స్మగ్లర్ల వాహనం ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో పీలేరు స్క్వాడ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాశ్ కాలు విరిగినట్లు సమాచారం. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, పరారైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు, అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.