కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి
ఘట్కేసర్ / Ntoday News: కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఆదివారం ఘటకేసర్ విజ కమిటీని ప్రకటించి నియామక పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ కార్యక్ర మాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి కార్యకర్తా సమన్వ యంతో పనిచేయాలని చెప్పారు ఈ కార్య క్రమంలో ఘటకేసర్ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, డీసీసీ సెక్రెటరీ మామిడ్ల ముత్యాలు యాదవ్, మాజీ సొసైటీ బ్యాంకు చైర్మెన్ రామ్ రెడ్డి, నాయకులు మల్లి పావని జంగయ్య యాదవ్, కడుపుల మల్లేష్ అభినందించారు.