హైడ్రా అధికారిక పోర్టల్ ప్రారంభం
Hyderabad / Ntoday News: హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అందిస్తున్న సేవల తెలుసుకునే వెసు లుబాటు హైడ్రా కల్పించింది. hydraa. te langana.gov.in పేరిట రూపొందించిన పోర్టలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహా యం, వాతావరణ వివరాలు, భూములు, చె రువులు, అధికార పరిధి తదితర అంశాలను తెలుసుకోవచ్చు. చెరువుల హద్దులు, కాలు వల లెక్కలు, ప్రభుత్వ భూముల వివరాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. హైడ్రా 24 గంటల అత్యవ సర హెల్ప్ లైన్ 1070 వివరాలను పోర్టల్లో ప్రముఖంగా పొందుపరిచారు. చెట్లు కూలి పోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థి తులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వవచ్చు, హైడ్రా పోర్టల్ ద్వారానే ఫైర్ సేఫ్టీ ఎన్వోసీలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వర్షపాతం.. వాతావరణ సమాచారం లైవ్ రైనా ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారం అందుబాటులో ఉంటుంది. వర్షాకాలంలో, భారీ వర్షాల సమయంలో ప్రజలు తాజా వాతావరణ పరిస్థితులను తెలు సుకునేందుకు ఉపయోగపడతాయి. చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల వివరాల హైడ్రా వెబ్సైట్ నుంచి చెరువులకు సంబం ధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) వివరా లు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్ఎఎల్, బఫర్ జోన్ నిబంధనలపై కూడా పోర్టల్లో సమాచారం అందుబాటు లో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి చెం దిన భూభారతి పోర్టల్కు హైడ్రా వెబ్ సైట్ లో నేరుగా లింక్ అందుబాటులో ఉంది. భూమి కొనుగోలు, ఇతర లావాదేవీలు చేపట్టే ముం దు సర్వేనం. పట్టాదారు వివరాల ఆధారంగా అందుబాటులో ఉన్న భూ రికార్డులను పరిశీ లించుకునే అవకాశం హైడ్రా కల్పించింది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, తాజా వివరాలు కూడా పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి.