BREAKING
thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 08:20 pm
Posted by : KOLA MAHESH

ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
29 Oct, 2026 - 08:20 PM
17 వీక్షణలు

జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన.. కరువు నివారణకు ముందస్తు చర్యలు

రామన్నపేట, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని నిదానపల్లి, ఇంద్రపాలనగరం, బోగారం గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. రానున్న ఎనిమిది నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో కరువు తీవ్రత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, నీటి సంరక్షణతో పాటు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా జల సంరక్షణ పనులు చేపట్టడం, నీటి వనరులను పరిరక్షించడం వంటి అంశాలను వివరించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

గ్రామస్థులు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించే చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల పాల్గొనడం

ఈ గ్రామసభల్లో ఎంపీడీవో రాములు, ఎంపీవో రఫీ, వ్యవసాయ అధికారి ఏజాజ్ ఖాన్, ఆశిష్ రాఘవ, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.