BREAKING
thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 07:43 pm
Posted by : KOLA MAHESH

విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
29 Oct, 2026 - 07:43 PM
17 వీక్షణలు

గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి.. త్వరలో గ్రామానికి వస్తానని హామీ

నెల్లికుదురు, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బియ్యాల వెంకట పాపారావును ఆ గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రాష్ట్ర రాజధాని పరిధిలోని మడికొండ రాంపూర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నాగబెల్లి బాలరాజుతో కలిసి భేటీ అయ్యారు.

గ్రామ అభివృద్ధిపై చర్చ

ఈ సందర్భంగా మునిగలవీడు గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ పరిస్థితులను బియ్యాల వెంకట పాపారావుకు వివరించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని సర్పంచ్ చైతన్య నాగరాజు కోరారు. గ్రామానికి విచ్చేసి ప్రజలకు మార్గదర్శనం చేసి, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా గ్రామానికి చెందిన బియ్యాల దయాకర్ రావు, బియ్యాల దేవేందర్, ఆలూ మినీ అసోసియేషన్ ఆఫ్ మునిగలవీడు అధ్యక్షుడు కోమండ్ల సోమేశ్వరరావును కూడా వారు కలిశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

గ్రామానికి వస్తానని హామీ

గ్రామ అభివృద్ధికి సహకరించాలని చేసిన విజ్ఞప్తిపై బియ్యాల వెంకట పాపారావు సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, త్వరలోనే మునిగలవీడు గ్రామానికి వచ్చి ప్రజలను కలుస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధికి అనుభవజ్ఞులైన పెద్దల సూచనలు, సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతామని సర్పంచ్ చైతన్య నాగరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బైస రాజేష్ తదితరులు పాల్గొన్నారు.