BREAKING
thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 08:14 pm
Posted by : KOLA MAHESH

ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం

తెలంగాణ
/ రంగారెడ్డి / అబ్దుల్లాపూర్మెట్
Reporter
Kola Mahesh Munugodu Constituency
29 Oct, 2026 - 08:14 PM
8 వీక్షణలు

సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడంపై గ్రామస్థుల ఆగ్రహం

జాతర ఏర్పాట్ల సమీక్షను బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దే నిర్వహించాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్

ఆరుట్ల, ఆగస్టు 29 (ఎన్ టుడే న్యూస్): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశానికి గ్రామ సర్పంచ్‌, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులకు సమాచారం ఇవ్వలేదనే అంశంపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మానిపాటి శోభాకుమార్‌, ఉపసర్పంచ్‌ నుకం రాజు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామపెద్దలతో సమావేశం నిర్వహించారు.

సర్పంచ్‌కు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన

ఈ సందర్భంగా పలువురు గ్రామపెద్దలు మాట్లాడుతూ.. ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. గతంలో గ్రామ సర్పంచ్‌, పాలకమండలి సభ్యులతో చర్చించి ఆలయ ప్రాంగణంలోనే జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించేవారని గుర్తుచేశారు.

ప్రస్తుత జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశాన్ని ఇబ్రహీంపట్నంలో నిర్వహించి, ఆరుట్ల సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. గ్రామ ప్రజల ఓట్లతో ఎన్నికైన సర్పంచ్‌కు అధికారిక కార్యక్రమాల్లో తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.

ఎస్టీ మహిళా సర్పంచ్‌ కావడంతోనే నిర్లక్ష్యమా?

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్‌ మాట్లాడుతూ.. ఆరుట్ల గ్రామంలో నిర్వహించాల్సిన జాతర సమీక్ష సమావేశాన్ని ఇబ్రహీంపట్నంలో నిర్వహించడం, సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎస్టీ మహిళ సర్పంచ్‌గా ఉన్నందువల్లే ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

ఆలయ కమిటీ ఏర్పాటు విషయంలోనూ గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని సమావేశంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపైనా అభ్యంతరాలు

మాజీ ఎంపీటీసీ చీరాల రమేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా నిర్వహించాలని సూచించారు. రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్‌ ప్రమేయం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆలయ ఎండోమెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి, సభ్యుల పేర్లను గ్రామపంచాయతీ బోర్డులో ప్రదర్శించకపోవడంపైనా అభ్యంతరం తెలిపారు.

గ్రామంలో అమలయ్యే సంక్షేమ పథకాల విషయంలో సర్పంచ్‌ను సంప్రదించాలని, అభివృద్ధి కార్యక్రమాలను అందరూ కలిసికట్టుగా చేపట్టాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అధికారుల స్పందన కోరిన సర్పంచ్

సర్పంచ్‌ మానిపాటి శోభాకుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు తనను ఎన్నుకున్నప్పటికీ, తమ సమస్యలతో తన వద్దకు వచ్చే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.

అధికారులు స్పందించి జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద తనతో పాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యుల సమక్షంలో నిర్వహించాలని కోరారు. తనకు తగిన గౌరవం కల్పించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు

ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శి చిలుకల వెంకటేష్‌, వార్డు సభ్యులు పంది శేఖర్‌, కొండిగారి శ్రావణ్‌కుమార్‌, మంకు మమత, వినోద్‌, మంద మాధవి, మోహన్‌రెడ్డి, పున్నం రాము, రావుల జంగయ్య, మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

అలాగే బీజేపీ నాయకులు కొంగర వెంకటరెడ్డి, తంగడిపల్లి నరేందర్‌ గౌడ్‌, సీపీఎం నాయకులు పుల్లగళ్ల గోపాల్‌, ఆనుపాటి గణేష్‌, ప్రజాగలం దామర భూపాల్‌, గ్రామపెద్దలు దంటు మధుసూదన్‌రెడ్డి, లొంగరి మారయ్య, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు అనంగళ్ల పరమేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చిందం రఘుపతి, మహమ్మద్‌ జానీ పాషా, చిందం జంగయ్య, మంకు వినోద్‌, మహమ్మద్‌ సద్దాం, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.