BREAKING
thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 08:16 pm
Posted by : KOLA MAHESH

ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
29 Oct, 2026 - 08:16 PM
11 వీక్షణలు

న్యాయవాదుల సంక్షేమం, రాజ్యాంగ పరిరక్షణే ఐలు లక్ష్యం

రామన్నపేట, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్): ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా అడ్వకేట్ యాదాసు యాదయ్య ఎన్నికయ్యారు. రామన్నపేట కోర్టు కాంప్లెక్స్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

నూతన కమిటీ ఎన్నిక

కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పాల్వంచ జగతయ్య, ఉపాధ్యక్షుడిగా అంకం నరేష్‌, ప్రధాన కార్యదర్శిగా గడ్డం నరసింహ ఎన్నికయ్యారు. సభ్యులుగా జితేందర్‌, తాటిపాముల కిరణ్‌కుమార్‌, బాలరాజును ఎంపిక చేశారు.

రాజ్యాంగ ఆశయాల సాధనకు కృషి చేస్తాం

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు యాదాసు యాదయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ఐలు పనిచేస్తుందని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమంతో పాటు రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పరిరక్షణకు కృషి చేస్తూ ఉన్నత ఆశయాల సాధనకు ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఐలు జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలి

ఈ నెల 31న భువనగిరిలోని న్యూ వివేరాలో నిర్వహించనున్న ఐలు జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని యాదయ్య కోరారు. ఈ మహాసభలకు చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.

“రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర” అనే అంశంపై నిర్వహించనున్న సెమినార్‌లో న్యాయవాదులు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.