BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 14 September 2026, 06:29 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఇందిరమ్మ టవర్స్ ఎలిజీ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 06:29 PM
1 వీక్షణలు

తెలంగాణ / Ntoday News: ఇందిరమ్మ టవర్స్ ఎల్జీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను సైతం ఈ వారంలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అర్హులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలిపారు. లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయి స్తామని, అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ ఇతర రూపాల్లో డబ్బులు చెల్లించవద్దని కోరారు. గృహానికి సంబంధించి మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించా ల్సిన మొత్తం, గడువు కేటాయింపు పత్రంతోపాటే తెలియజేస్తామని పేర్కొన్నారు. అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. లబ్ధిదారులు గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్సైట్ tghb.telangana.gov.in ను సందర్శించవచ్చని చెప్పారు. కాల్ సెంటర్ నంబరు 040-24603572 నంబర్లోనూ సంప్రదించాలని పేర్కొన్నారు.