BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 07:52 pm
Posted by : SHAIK ARIFODDIN

రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
SHAIK ARIFODDIN Makloor mandal
15 Nov, 2026 - 07:52 PM
28 వీక్షణలు

ప్రతి ఆరు నెలలకోసారి రోడ్డు ప్రమాదాలు.. అయినా మారని పరిస్థితి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి

నిజామాబాద్ జిల్లా (ఎన్ టుడే న్యూస్):

రైతులు రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య కారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని, కొందరికి తీవ్ర గాయాలై కళ్లు దెబ్బతినడం, కోమాలోకి వెళ్లడం, మరికొందరు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ సమస్యపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

చీకటి సమయాల్లో రహదారులపై ధాన్యం కుప్పలు, ఆరబెట్టిన ధాన్యం కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని బాధితులు పేర్కొంటున్నారు. రహదారులు వాహనాల రాకపోకల కోసం ఉన్నాయని, వాటిపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తించి రహదారులపై ధాన్యం ఆరబెట్టడం మానుకోవాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలని, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.