BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 11:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏకగ్రీవ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 11:31 AM
7 వీక్షణలు

రూ.50 లక్షల వరకు నిధులు జనాభా ఆధారంగా ప్రోత్సాహక మొత్తాల పెంపు.. 2026 ఎన్నికలకే వర్తింపు ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడి ఏలూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తాలను పెంచింది. ఈ మేరకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందించనున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం 5 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది. గతంలో 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2,001 నుంచి 5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5,001 నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు మాత్రమే ప్రోత్సాహకంగా అందించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ మొత్తాలను గణనీయంగా పెంచింది. అయితే గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవితో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగి, ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన పంచాయతీలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత కలిగిన పంచాయతీల వివరాలను అధికారులు పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ప్రోత్సాహక నిధులను నిర్దేశిత ఆర్థిక, ఖాతాల నిర్వహణ, తనిఖీ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత గ్రామ పంచాయతీల ఆమోదం పొందిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పనులకే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల పదవీకాలంలో ఈ నిధులను దశలవారీగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సంఖ్య, జనాభా వర్గాల వారీగా అర్హత కలిగిన పంచాయతీల వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు.