BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 11:46 am
Posted by : MUSUGU GOPI

మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు గౌరవ వేతనం మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
16 Nov, 2026 - 11:46 AM
11 వీక్షణలు

కేటగిరీల వారీగా రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లింపులు

అమరావతి (ఎన్ టుడే న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించిన రెండో సాధారణ ఎన్నికల విధుల్లో వాస్తవంగా పాల్గొన్న అర్హులకు ఈ చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి వారి హోదా, విధుల నిర్వహణ కాలాన్ని బట్టి గౌరవ వేతనం చెల్లించనున్నారు.

కేటగిరీల వారీగా గౌరవ వేతన వివరాలు:

1. రిటర్నింగ్ అధికారులు (RO): రోజుకు రూ.1,000 చొప్పున 20 రోజులకు మొత్తం రూ.20,000.

2. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ARO): రోజుకు రూ.800 చొప్పున 20 రోజులకు మొత్తం రూ.16,000.

3. ఎన్నికల అధికారులు (EO): రోజుకు రూ.1,000 చొప్పున 15 రోజులకు మొత్తం రూ.15,000.

4. అదనపు ఎన్నికల అధికారులు: రోజుకు రూ.800 చొప్పున 15 రోజులకు మొత్తం రూ.12,000.

5. అసిస్టెంట్ ఎన్నికల అధికారులు: రోజుకు రూ.800 చొప్పున 15 రోజులకు మొత్తం రూ.12,000.

మున్సిపల్ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి:

  • గెజిటెడ్ అధికారులు: రోజుకు రూ.1,000 చొప్పున 15 రోజులకు రూ.15,000.

  • సీనియర్ అసిస్టెంట్ లేదా సమాన కేడర్ వరకు ఉన్న నాన్‌-గెజిటెడ్ అధికారులు: రోజుకు రూ.800 చొప్పున 15 రోజులకు రూ.12,000.

  • జూనియర్ అసిస్టెంట్లు, వార్డు సెక్రటరీలు లేదా సమాన కేడర్ ఉద్యోగులు: రోజుకు రూ.600 చొప్పున 15 రోజులకు రూ.9,000.

  • ఇతర ఉద్యోగులు, సిబ్బంది: రోజుకు రూ.400 చొప్పున 15 రోజులకు రూ.6,000.

మాస్టర్ ట్రైనర్లకు: ఎన్నికల శిక్షణ కార్యక్రమాలకు హాజరైన వాస్తవ రోజులకు రోజుకు రూ.800 చొప్పున చెల్లించనున్నారు.

చెల్లింపులకు ప్రభుత్వం విధించిన నిబంధనలు

ఎన్నికల విధులకు వాస్తవంగా నియమితులై, బాధ్యతలు నిర్వహించిన అర్హులైన ఉద్యోగులకు మాత్రమే గౌరవ వేతనం చెల్లిస్తారు. సంబంధిత మున్సిపాలిటీల జనరల్ ఫండ్స్ నుంచి జనరల్ బాడీ, మున్సిపల్ కౌన్సిల్ లేదా స్పెషల్ ఆఫీసర్ ఆమోదం పొందిన అనంతరం నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలి.

అలాగే గౌరవ వేతన చెల్లింపులకు సంబంధించిన రికార్డులు, వివరాలను భవిష్యత్తులో ఆడిట్ పరిశీలన కోసం భద్రపరచాలని ప్రభుత్వం సూచించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలు: Roc.No.3437421/2026/H(Bud), ఎన్నికల అథారిటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి 2026 నవంబర్ 12న ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అందించిన సమాచారం పేర్కొంటోంది.