BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 08:44 am
Posted by : BOYA SWAMY

అంతర్జాతీయ వేలంలో గోల్కొండ పింక్ వజ్రానికి భారీ ధర.. రూ.130 కోట్లకు విక్రయం

తెలంగాణ
/ రంగారెడ్డి / బాలాపూర్
Reporter
Boya Swamy Chityala Mandal
16 Nov, 2026 - 08:44 AM
14 వీక్షణలు

జెనీవాలో క్రిస్టీస్ వేలంలో రికార్డు ధర పలికిన అరుదైన ‘బల్గారి పింక్’ డైమండ్

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): తెలంగాణకు చెందిన చారిత్రక గోల్కొండ వజ్రాల ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన అరుదైన గులాబీ రంగు వజ్రం ‘బల్గారి పింక్’ జెనీవాలో నిర్వహించిన అంతర్జాతీయ వేలంలో ఏకంగా రూ.130 కోట్ల ధర పలికింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ నిర్వహించిన ఈ వేలంలో వజ్రం భారీ మొత్తానికి అమ్ముడై అందరి దృష్టిని ఆకర్షించింది.

24 క్యారెట్ల బరువున్న ఈ అరుదైన వజ్రాన్ని 1950వ దశకంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం ప్రముఖ ఆభరణాల సంస్థ బల్గారి దీనిని ప్రత్యేకంగా ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద భద్రంగా ఉన్న ఈ వజ్రాన్ని తొలిసారిగా వేలానికి తీసుకురావడం విశేషం.

అరుదైన గులాబీ రంగు, నాణ్యత, ప్రత్యేకత కారణంగా ఈ వజ్రానికి అంతర్జాతీయ మార్కెట్‌లో విశేష గుర్తింపు లభించింది. క్రిస్టీస్ సంస్థ దీనిని ‘పింక్ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించింది.

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ వజ్రాల వైభవం, వాటి ప్రత్యేకత మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రస్తావనకు రావడంతో తెలంగాణ చారిత్రక వారసత్వంపై ఆసక్తి పెరిగింది.