తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం.
మర్రిగుడ/ ఎన్ టుడే న్యూస్.
కొండూరు గ్రామ పంచాయతీకి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో ఎలాంటి దుర్వినియోగం జరగలేదని సర్పంచ్ ఆంగోతు సీతారాం నాయక్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన ప్రతి పనికి మెజర్‌మెంట్ బుక్ (ఎంబీ) ఆధారంగానే నిధుల డబ్బులు వినియోగించామని స్పష్టం చేశారు గత పనిచేసిన సర్పంచులకు సెక్రటరీ గ్రామ వార్డు సభ్యుల సమక్షంలో డబ్బులు చెల్లించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్మికులకు అదే విధంగా నీళ్ల సదుపాయం చేయించడం కోసం నిధులను వాడడం జరిగిందని అన్నారు
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు గ్రామంలో కోతులను పట్టియాలని సర్పంచ్ అని కూడా చూడకుండా అసభ్యతజాలంతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నిధుల దుర్వినియోగంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఏ పార్టీ నాయకుడినైనా కలిసి పనులు చేయించుకుంటానని తెలిపారు.తనపై తప్పుడు ప్రచారం చేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.