శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఆశ్రమ నిర్వహకురాలు అరుణ జ్యోతి
అమృతమూర్తి అరుణ జ్యోతి కి వృద్ధులు కృతజ్ఞతలు
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు
ఆమడగూరు , మండలంలోని గాజులపల్లి సమీపంలో ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో గురువారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆశ్రమం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం వృద్ధుల సమక్షంలో శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ జ్యోతి వృద్ధుల సమక్షంలోనే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా అమె మాట్లాడుతూ వయోవృద్ధులు సమాజానికి మార్గదర్శకులనీ, వారి అనుభవం , మార్గదర్శకత్వం, నేటి తరానికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. వారిని సంతోషకరంగా , ఆరోగ్యంగా ఉంచడమే శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం ప్రధాన ధ్యేయమని ఆమె తెలిపారు.
అమృతమూర్తి అరుణ జ్యోతి కి వృద్ధులు కృతజ్ఞతలు: శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ జ్యోతి వృద్ధుల పట్ల మాతృ హృదయంతో, ఆప్యాయత అనురాగాలను పంచుతూ, అనునిత్యం వృద్ధులు అవసరాలను తీరుస్తున్న అమృతమూర్తి అరుణ్ జ్యోతిని వృద్ధులు దీవించారు. వృద్ధాప్యంలో తమకు కొండంత అండగా నిలిచి, సొంత కుటుంబ సభ్యురాలిలా తమను ఆదరిస్తున్న అమృతమూర్తి అరుణ జ్యోతి కి వృద్ధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు