BREAKING
thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 October 2026, 06:23 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక..

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
01 Oct, 2026 - 06:23 PM
14 వీక్షణలు
  • అధ్యక్ష, కార్యదర్శులుగా మణికంఠ రెడ్డి, లక్ష్మణ్
    నూతన కమిటీ
  • రాష్ట్ర కార్యదర్శి: పుట్ట లక్ష్మణ్ (మేడ్చల్)
  • రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్: ఇటిక్యాల రామకృష్ణ (ఖమ్మం)
  • రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి: రెహమాన్ (నల్గొండ)

హన్మకొండ జిల్లా, ఎన్ టుడే న్యూస్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్ మరోసారి ఎన్నికైనట్లు నాయకులు తెలిపారు.

హన్మకొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు నిర్వహించారు. సెప్టెంబర్ 28న భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించగా, 29, 30 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ 90 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, పోరాటాలు, విజయాలతో పాటు విద్యారంగ సమస్యలపై చర్చలు నిర్వహించినట్లు తెలిపారు.

సెప్టెంబర్ 30న జరిగిన రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో నూతన ఆఫీస్ బేరర్స్ కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను హన్మకొండ బాలసముద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ వెల్లడించారు.

రాష్ట్ర అధ్యక్షుడు: కసిరెడ్డి మణికంఠ రెడ్డి (కరీంనగర్)

రాష్ట్ర ఉపాధ్యక్షులు:

  • బానోత్ రఘురాం నాయక్ (నిజామాబాద్)

  • లెనిన్ (ఉస్మానియా యూనివర్సిటీ)

  • ముదిగొండ మురళీకృష్ణ (నల్గొండ)

  • బలుముల ప్రేమ్ కుమార్ (నాగర్ కర్నూల్)

రాష్ట్ర సహాయ కార్యదర్శులు:

  • భాషబోయిన సంతోష్ (హన్మకొండ)

  • నెల్లి సత్య (హైదరాబాద్)

  • సామిడి వంశీవర్ధన్ రెడ్డి (రంగారెడ్డి)

  • జేరిపోతుల జనార్ధన్ (సిద్దిపేట)

ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో, రాష్ట్రంలో పాలకులు విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని వారు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ విభజన హామీల మేరకు రాష్ట్రానికి కేటాయించాల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, బడ్జెట్‌లో విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించడం లేదని వారు విమర్శించారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడంపైనా వారు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటిక్యాల రామకృష్ణ, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రెహమాన్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రఘురాం నాయక్, భాషబోయిన సంతోష్, లెనిన్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ గౌడ్, వరంగల్ జిల్లా కార్యదర్శి శరత్, నాయకులు భాను, వినయ్ తదితరులు పాల్గొన్నారు.