అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం
గడ్డిఅన్నారం/ఎన్ టుడే న్యూ స్..
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకుని ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డుల్లో గడ్డిఅన్నారం డివిజన్ పి.&టి. కాలనీ నివాసి పున్న శ్రీనివాస్ చోటు దక్కించుకున్నారు. ప్రాంతీయ ఖ్యాతిని పెంపొందించిన శ్రీనివాస్ నివాసానికి గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా వెళ్ళి కలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భవాని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సేవలందిస్తున్న శ్రీనివాస్ కు ఈ అవార్డు దక్కడం గడ్డిఅన్నారం డివిజన్ కే గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.