కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌తో పాటు కార్పొరేషన్ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం కార్పొరేషన్ డైరెక్టర్లకు చైర్మన్ పట్టాభిరామ్ అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు చిన్ని శ్రీనివాసరావు, రవి కుమార్, ఆరుద్ర భూలక్ష్మి, లక్ష్మణరావు బొమ్మినేని, ఎం. నాగలక్ష్మి, ఎన్. పర్వీన్ భాను, నాగమణి బోలెం, పరుచూరి భవానీ రవికుమార్, రాము బుచ్చా, రెడ్డివారి మంజునాథ్, సానారెడ్డి కల్పనారెడ్డి, ఉదయ భాస్కర్ కూచిపూడి, పట్టాభిరామయ్య సాలాది, మువ్వల వెంకట రమణతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.