చిట్యాల ఆరోవార్డు లేఅవుట్ కు ఎలాంటి అనుమతులు లేవు:
సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు వెల్లడి
NTODAY NEWS ,: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు వెంకటాపురం దగ్గర సర్వే నంబర్ 308 లో ఏర్పాటు చేసిన లేఅవుట్ కు ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ సమాచార పౌర సంబంధాల అధికారి స్పష్టం చేశారు. సంతోష్ నగర్ కు చెందిన కాలిన శ్రీశైలం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దాఖలు చేసిన దరఖాస్తుకు మున్సిపల్ కార్యాలయం అధికారిక సమాధానం ఇచ్చింది.సదరు సర్వే నంబర్‌లోని లేఅవుట్ వివరాలు, ప్లాట్ల విస్తీర్ణం, లేఅవుట్‌లో మున్సిపాలిటీకి కేటాయించిన 10 శాతం స్థలం, లేఅవుట్ అప్రూవల్ ప్రొసీడింగ్స్‌తో పాటు ఎల్‌పి కాపీలకు సంబంధించిన వివరాలను ఆయన కోరారు.
దీనికి స్పందించిన అధికారులు, దరఖాస్తుదారుడు కోరిన లేఅవుట్‌కు సంబంధించి గతంలో మున్సిపాలిటీ ద్వారా స్థల పరిశీలన నిర్వహించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని, దీనికి సంబంధించిన రికార్డులేవీ కార్యాలయంలో లేవని స్పష్టం చేశారు.