గురుకుల విద్యార్థులకు పరుపుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
మార్కాపురం: మండలంలోని రాయవరం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులకు గురువారం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే పరుపులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మంచి మార్కులు సాధించాలని సూచించారు.
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.