BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 05:18 pm
Posted by : NTODAY NEWS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
17 Aug, 2026 - 05:18 PM
68 వీక్షణలు

ఆగస్టు 20న దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ప్రదర్శన

సైదాబాద్: ఎన్ టుడే న్యూస్.

దేశంలో, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను యువజన సంఘం, నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి ఎండీ అబ్బాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలను విస్మరించడం వల్ల నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.

ఆగస్టు 20న భారీ ప్రదర్శన

నిరుద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20న ఉదయం 11 గంటలకు దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ నుంచి రైస్ మిల్లు అసోసియేషన్ భవనం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎండీ అబ్బాస్ తెలిపారు.

ఈ ప్రదర్శనలో నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు

ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.

ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నియామకాలను సకాలంలో పూర్తి చేయాలి.

నిరుద్యోగులకు గౌరవప్రదమైన నిరుద్యోగ భృతి అందించాలి.

పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలి.

ప్రైవేటు సంస్థల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి కొత్త ఉద్యోగాలను సృష్టించాలి.

నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ అధ్యక్షులు కోట రమేష్, నిరుద్యోగ జేఏసీ నాయకులు కేఎల్ మూర్తి, బాలు నాయక్, ఏ. కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.