చనుబండలో రైతులకు మినుము విత్తనాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి: ఎల్‌నినో ప్రభావం నుంచి రైతులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామం–1 వద్ద రాయితీపై మినుము విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. మెట్ట పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు నష్టాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీపై మినుము విత్తనాలను పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, బుర్రి శ్రీకర్, వీఆర్వో శోభన్‌బాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.