BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 01 October 2026, 10:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Oct, 2026 - 10:15 PM
7 వీక్షణలు

తిరువూరులో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 45 మంది మహిళలకు చీరల పంపిణీ.. వయోవృద్ధులకు సన్మానం

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఐడియాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులను శాలువాలతో సన్మానించి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 91 ఏళ్ల నోముల జమలమ్మ, 86 ఏళ్ల తగరం అక్కమ్మ, 75 ఏళ్ల గుంజ హనుమమ్మ, గుంజ కౌసల్యలను ఐడియాస్ సంస్థ డైరెక్టర్ శౌరి, సెక్రటరీ మేరీ రాణి శాలువాలతో సత్కరించారు.

రాజుపేట కొత్త కాలనీ, ముస్లిం బజార్ రోడ్డు, వడ్డెర కాలనీలకు చెందిన 45 మంది మహిళలకు జర్మనీలోని మిసెరియోర్ సంస్థ సహకారంతో చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శౌరి మాట్లాడుతూ వృద్ధులు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతిరోజూ వీలైనంతవరకు చిన్నచిన్న వ్యాయామాలు చేయాలని సూచించారు.

సంస్థ జనరల్ మేనేజర్ అంతయ్య మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రేమ, ఆదరణ, గౌరవం చూపించాలని, వారిని ఆప్యాయంగా చూసుకోవాలని అన్నారు. సమాజంలో వృద్ధుల అనుభవం ఎంతో విలువైనదని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అంతయ్య, కోఆర్డినేటర్ నాగలక్ష్మి, సెక్రటరీ మేరీ రాణి, వాలంటీర్ దేవరపల్లి శ్రీను, కేసరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.