BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 07:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సౌర విద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Oct, 2026 - 07:40 PM
12 వీక్షణలు

సౌర విద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలి విద్యుత్‌ శాఖ డీఈ బండి శ్రీనివాసరావు

మధిర: ప్రతి కుటుంబం సౌర విద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకోవాలని విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఇంజినీర్‌ బండి శ్రీనివాసరావు సూచించారు. సౌర విద్యుత్‌ వినియోగంతో విద్యుత్‌ పొదుపుతో పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని విద్యుత్‌ శాఖ డివిజన్‌ కార్యాలయ ప్రాంగణంలో గురువారం విద్యుత్‌ శాఖ, రెడ్కో సంస్థ, సంబంధిత బ్యాంకు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో సౌర విద్యుత్‌ ప్యానళ్ల ఏర్పాటుపై అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకం కింద అర్హులైన వినియోగదారులు ఇంటిపై సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.78 వేల వరకు సబ్సిడీ పొందవచ్చని వివరించారు. సౌర విద్యుత్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నిబంధనలకు అనుగుణంగా విద్యుత్‌ సంస్థకు అందించే అవకాశం ఉంటుందని, దీనివల్ల అదనపు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.

మధిర విద్యుత్‌ శాఖ డివిజన్‌ కార్యాలయంలో అక్టోబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, విద్యుత్‌ బిల్లు, బ్యాంకు పాస్‌బుక్‌తో కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రెడ్కో సంస్థ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, విద్యుత్‌ వినియోగదారులు పాల్గొన్నారు.