BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 15 August 2026, 07:59 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
15 Aug, 2026 - 07:59 PM
252 వీక్షణలు

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా...

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ అధ్యక్షతన నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ హార్కర వేణుగోపాల్ రావు గారితో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పేద మరియు అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంలో స్మార్ట్ రేషన్ కార్డులు కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.


ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి, మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా సంబంధిత అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమం – ప్రజల ఆహార భద్రత – ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.