స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. వ్యక్తి మృతి
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని టిప్పర్ లారీ ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.