BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:00 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
14 Nov, 2026 - 07:00 PM
28 వీక్షణలు

మరో ఆరుగురికి తీవ్ర గాయాలు.. నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

రొంపిచర్ల, నవంబర్ 14:

మండల పరిధిలోని సుబ్బయ్యపాలెం వై జంక్షన్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే రహదారిపై వెళ్తున్న కారు, రోడ్డు దాటుతున్న ఆటోను వేగంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు ఈపూరు మండలం గుండేపల్లి గ్రామంలో తమ బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆటోలో తమ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ క్రమంలో రొంపిచర్ల మండల పరిధిలోని సుబ్బయ్యపాలెం వై జంక్షన్ వద్ద హైవే రహదారిని దాటుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి ఆటోలో ఉన్న ప్రయాణికులు రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గోపమ్మ (40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆటోలో ఉన్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం అదే ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.