BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 09:58 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

బి.ఆర్.ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
14 Nov, 2026 - 09:58 PM
12 వీక్షణలు

కందుకూరు పట్టణం లోని బి.ఆర్.ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్య సిబ్బంది జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలను, బాలల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను కొనియాడారు.

అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజన సదుపాయం కల్పించారు. సాయంత్రం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారికి నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు నేర్పించినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యాసంస్థల  డైరెక్టర్ జి.బాలభాస్కర రావు మాట్లాడుతూ నెహ్రూ దూరదృష్టి, వినూత్న ఆలోచనలు దేశాభివృద్ధికి బాటలు వేశాయని, విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ బి.నరేంద్ర, డీన్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.