BREAKING
thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● వృత్తి విద్యార్థుల ఉద్యోగ శిక్షణను పరిశీలించిన కోనసీమ వొకేషనల్ కమిటీ thumb ● పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● వృత్తి విద్యార్థుల ఉద్యోగ శిక్షణను పరిశీలించిన కోనసీమ వొకేషనల్ కమిటీ thumb ● పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు
Test 4
Date of Publish : 14 November 2026, 09:28 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
14 Nov, 2026 - 09:28 AM
13 వీక్షణలు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు.. అనుభవజ్ఞుడైన నాయకుడిగా రామకృష్ణంరాజును పార్టీ ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని వెల్లడి

ఆత్రేయపురం, నవంబర్ 14: రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి చిలువూరి రామకృష్ణంరాజును గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్రేయపురంలో నిర్వహించిన మండల వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. చిలువూరి రామకృష్ణంరాజుకు ప్రజా సేవలో విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా, గ్రామ సర్పంచ్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉందన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేసి ఆయన విజయానికి కృషి చేయాలని కోరారు.

అనంతరం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. తుఫాన్ల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

చిలువూరి రామకృష్ణంరాజు గ్రామాభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు తన వంతు సహకారం అందిస్తానని చిర్ల జగ్గిరెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కె. నాగిరెడ్డి, పచ్చమట్ల రాజగోపాలరాజు, కృష్ణంరాజు, గొట్టుముక్కల గోపిరాజు, బెజవాడ సతీష్, భాస్కర్‌రెడ్డి, కాలాబత్తుల అబ్బులు, గురజ శ్రీరామ్మూర్తి, రొట్టె దావీదు, ముదునూరి నాగు, సరేలే సత్తిపండు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.