BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 10:03 pm
Posted by : P GAJENDRA BABU

శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
13 Nov, 2026 - 10:03 PM
15 వీక్షణలు

కార్తీక మాసోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శివ సాయి యోగా విద్యార్థుల ప్రతిభాప్రదర్శన.. చిన్నారులను, యోగా గురువు సుజాతను అభినందించిన దేవస్థానం అధికారులు, భక్తులు

శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మాదాయ శాఖ, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక శివ సాయి యోగా సంస్థకు చెందిన విద్యార్థులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.

యోగా గురువు సుజాత శిక్షణలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. యోగాతో పాటు నృత్య ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య సాగిన ఈ కార్యక్రమం ఆలయానికి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు, నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు కనబరిచిన ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులతో పాటు వారికి శిక్షణ అందించిన యోగా గురువు సుజాతను దేవస్థానం అధికారులు, భక్తులు ప్రత్యేకంగా అభినందించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి.