BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:53 pm
Posted by : K MAHESH

విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు..

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:53 PM
20 వీక్షణలు

పెద్ద ముప్పారంలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా కార్యక్రమం.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం

దంతాలపల్లి, నవంబర్ 13: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పెద్ద ముప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు వివిధ తరగతుల్లో ఉపాధ్యాయుల బాధ్యతలను స్వీకరించి, పాఠ్యాంశాలను బోధించారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ పాఠాలు చెప్పడంతో పాటు, విద్యార్థులకు అర్థమయ్యేలా విషయాలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు బోధనా అనుభవంతో పాటు బాధ్యతలు స్వీకరించడం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం వంటి అంశాలపై అవగాహన కలిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రాముఖ్యతను, స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణ ఉద్దేశాన్ని వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వయంగా పోషించడం ద్వారా బోధనలో ఎదురయ్యే సవాళ్లను తెలుసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, పాఠశాల నిర్వహణలో బాధ్యతాయుతమైన భాగస్వాములుగా ఎదిగేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కుమారి సింధు ప్రియా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా, మేఘన ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూరపాటి యాకన్న బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్ర పోషించిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.