BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:53 pm
Posted by : కూనురు మధు

10 మంది హోంగార్డులకు రూ.3.43 లక్షల సంక్షేమ సాయం పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ
13 Nov, 2026 - 07:53 PM
40 వీక్షణలు

వైద్య చికిత్స, మెరిట్ స్కాలర్‌షిప్‌లు, డెత్ బెనిఫిట్స్, పదవీ విరమణ ప్రయోజనాల కింద ఆర్థిక సహాయం.. చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఎన్‌టుడే న్యూస్‌ | నల్లగొండ: హోంగార్డుల సంక్షేమం, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీస్ శాఖలో కీలక భాగస్వాములుగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సేవలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర డీజీపీ (హోంగార్డ్స్), హైదరాబాద్ ఆమోదంతో సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన 10 మంది హోంగార్డులకు వివిధ సంక్షేమ పథకాల కింద మొత్తం రూ.3,43,000 మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

మంజూరైన ఆర్థిక సహాయంలో భాగంగా ఇద్దరు హోంగార్డులకు వైద్య చికిత్స కోసం రూ.20 వేలు, ఇద్దరు హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌ల కింద రూ.3 వేలు అందజేశారు. విధి నిర్వహణలో ఉండగా లేదా ఇతర కారణాలతో మరణించిన నలుగురు హోంగార్డుల కుటుంబాలకు డెత్ బెనిఫిట్ కింద రూ.60 వేలు మంజూరు చేశారు. అలాగే పదవీ విరమణ పొందిన ఇద్దరు హోంగార్డులకు రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ.2.60 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి వివిధ విధుల్లో హోంగార్డులు పోలీస్ శాఖకు కీలకంగా సేవలందిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో వారి కృషిని గుర్తించడంతో పాటు, ఆపద సమయంలో వారికి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.

హోంగార్డులు ఎదుర్కొనే వైద్య, కుటుంబ, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హోంగార్డులు క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కళ్యాణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.