BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:50 pm
Posted by : K MAHESH

మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:50 PM
18 వీక్షణలు

బ్రహ్మోత్సవాల కరపత్రాలు, ఆహ్వాన పత్రికలు, గోడపత్రిక ఆవిష్కరణ.. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 13: వలిగొండ మండలం వెంకటాపురంలోని శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.

ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, ఆహ్వాన పత్రికలు, గోడపత్రికను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆలయ బ్రహ్మోత్సవాల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. స్వామివారి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, ధర్మకర్తలు తుమ్ముల కరుణాకర్ రెడ్డి, దామెర అనంతాచారి, కంబాలపల్లి అండాలు, కొత్త జంగయ్య, ఆవుల చంద్రకళ, రాధారపు రమేష్, భట్టు నర్సింహ, మీసాల ముత్యాలు, కేసిరెడ్డి నరేందర్ రెడ్డి, కూర వెంకటేశం, ఎస్. నర్సింహ, బుర్కుల కుమార్ గౌడ్, బోడిగే వెంకటేశం, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.