BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 08:33 pm
Posted by : PAMMI NAVEENKUMAR

ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
13 Nov, 2026 - 08:33 PM
24 వీక్షణలు

జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు పెంపు.. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలకు పైబడిన వాటికి రూ.50 లక్షలు

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో ప్రోత్సాహకాలు అందించేలా నిర్ణయం తీసుకుంది. పంచాయతీల జనాభా ఆధారంగా ఈ మొత్తాలను ఖరారు చేసింది.

కొత్త ప్రతిపాదన ప్రకారం 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు అందించనున్నారు. 5,001 నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామపంచాయతీలకు కనిష్టంగా రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించేవారు. ప్రస్తుతం ఆ మొత్తాలను గణనీయంగా పెంచడంతో ఏకగ్రీవ పంచాయతీలకు లభించే ఆర్థిక ప్రోత్సాహకం మరింత పెరగనుంది.

జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలను పెంచడం ద్వారా గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ప్రోత్సాహకాల అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, నిబంధనల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.