BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:57 pm
Posted by : K MAHESH

నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:57 PM
22 వీక్షణలు

మునిపంపులలో రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ.. సిరిపురంలో ఇంటింటి ప్రచారం, గోడపత్రిక ఆవిష్కరణ

యాదాద్రి జిల్లా, రామన్నపేట, నవంబర్ 13: నల్లగొండలో నవంబర్ 15న నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు రైతాంగం అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా మునిపంపుల గ్రామంలో రైతులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.

ఎర్రజెండాలు చేతబూని, రైతు నినాదాలు చేస్తూ నిర్వహించిన ఈ ర్యాలీ గ్రామంలో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని, రైతుల హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు దిశానిర్దేశం చేసే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలకు నల్లగొండ వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభకు మునిపంపుల గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని కోరారు.

అగ్రిషోను విజయవంతం చేయాలి

సిరిపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో నిర్వహించనున్న అగ్రిషోను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరిపురం గ్రామంలో ఆయన నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలు, అగ్రిషోకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో నిర్వహించనున్న అగ్రిషోలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. రైతులు ఈ ప్రదర్శనను సందర్శించి వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తులు, యంత్రాల గురించి తెలుసుకోవాలని కోరారు. రైతు సంఘం జాతీయ మహాసభలు, అగ్రిషో కార్యక్రమాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు తొలుపునూరి శ్రీనివాస్, శాఖ కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, అంబటి మల్లారెడ్డి, బడుగు రమేష్, గంటెపాక శివకుమార్, మేడి ముకుంద, నోముల నర్సిరెడ్డి, ఎండీ మైనొద్దీన్, తొలుపునూరి చంద్రశేఖర్, సిలివేరు సత్తయ్య, దాడి మల్లారెడ్డి, ఏళ్ల సంతోష్ రెడ్డి, జోగుల శ్రీనివాస్, పులిపాలుపుల నాగార్జున, బూడిద బిక్షం, మేడి భాషయ్య, నోముల రమేష్, తాళ్లపల్లి మల్లేష్, మృత్యుంజయ, సంగిశెట్టి మహేష్, స్వామి తదితరులతో పాటు గ్రామ రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.