BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:48 pm
Posted by : K MAHESH

గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:48 PM
25 వీక్షణలు

ప్రతి గ్రామ పంచాయతీని చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా తీర్చిదిద్దాలి.. బాలకార్మికులు, బాల్యవివాహాలు, బడి మానేసిన పిల్లలను గుర్తించి అండగా నిలవాలి: జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 13: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీని బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీగా (చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ) తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సమిష్టిగా కృషి చేయాలని జవహర్ బాల్ మంచ్ (జేబీఎం) జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక (సీఆర్‌పీఎఫ్) జిల్లా కన్వీనర్ ఆవుల వినోద్ కుమార్ కోరారు.

శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 14న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో పిల్లల గ్రామసభలు నిర్వహించి, బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బాలల సమస్యలపై దృష్టి సారించి గ్రామస్థాయిలో వారి హక్కులు, అవసరాలపై చర్చించేందుకు అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో బాలకార్మికులు, బాల్యవివాహాలు, మధ్యలోనే చదువు మానేసిన పిల్లలు (డ్రాపౌట్స్), అనాథ పిల్లలు, ఒంటరి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలను గుర్తించాలని సూచించారు. అలాంటి పిల్లలకు గ్రామ పంచాయతీ ద్వారా అవసరమైన సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య, ఆరోగ్యం, రక్షణ వంటి అంశాల్లో బాలలకు ఎదురవుతున్న సమస్యలను గ్రామసభల్లో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని తెలిపారు.

అలాగే గ్రామాల్లో బాలలపై శారీరక, మానసిక వేధింపులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు భయం లేకుండా తమ సమస్యలను గ్రామసభల్లో వెల్లడించే వాతావరణం కల్పించాలని, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు గ్రామస్థాయి నుంచే చర్యలు ప్రారంభించినప్పుడే ప్రతి గ్రామాన్ని బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని కొడారి వెంకటేష్, ఆవుల వినోద్ కుమార్ పేర్కొన్నారు.